పెద్ద దస్తగిరి హత్య వెనక వైసీపీ పెద్దల హస్తం: మంత్రి కొలుసు పార్థసారథి
వైసీపీ రాజకీయ పార్టీ కాదని.. హత్య రాజకీయాలకు డెన్ పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister


అమరావతి, 21 ఏప్రిల్ (హి.స.)వైసీపీ రాజకీయ పార్టీ కాదని.. హత్య రాజకీయాలకు డెన్గా తయారైందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అనుమతులపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య వెనక ఆ పార్టీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ఐదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకోవడం, దాచుకోవడమే జగన్ పార్టీ చేసిందని విమర్శించారు. ఈరోజు (మంగళవారం) అమరావతి వేదికగా మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. చీకట్లో చంపడం.. పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.

పెద్ద దస్తగిరి ఇంట్లో వందల కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు దొరికాయని మంత్రి కొలుసు పార్థసారథి ప్రస్తావించారు. జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తుల డాక్యుమెంట్లు, హత్యకు గురైన పెద్ద దస్తగిరి ఇంట్లో ఎలా లభించాయని ప్రశ్నించారు. హత్యకు గురైన పెద్ద దస్తగిరి.. కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత ముఖ్యుడని చెప్పుకొచ్చారు.

ఆస్తులు, అధికారం కోసం వైసీపీ నేతలు ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య నుంచి, పెద్ద దస్తగిరి హత్య వరకు జగన్ పార్టీ ఒకే తరహా నాటకమాడుతోందని ఎద్దేవా చేశారు. పెద్ద దస్తగిరి హత్యకు ప్రధాన కారకులైన వారు.. ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande