పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడి.. 17 మంది అరెస్టు
పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడి.. 17 మంది అరెస్టు
పేకాట


కరీంనగర్, 21 ఏప్రిల్ (హి.స.)

మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు గత కొంతకాలంగా రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై పోలీసులు గత అర్థరాత్రి దాడి చేసి పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం కరీంనగర్ పట్టణం శుభాష్ నగర్ లోని రెడ్డి హాస్టల్ సమీపంలో ఓ ఇంట్లో 17 మంది వ్యక్తులతో కలిసి పేకాట ఆడుతున్నారని కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పేకాట రాయుళ్లని చాకచక్యంగా పట్టుకున్నారు.

వారి నుంచి సుమారు 6,75,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే పట్టుబడిన వారిలో రైస్ మిల్లు నిర్వాహకుల అసోసియేషన్ సభ్యులు, తిమ్మపూర్ మండలానికి చెందిన సర్పంచులు, అధికార పార్టీ నాయకులు, వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖులు, విలేకరులు కూడా ఉన్నారని తెలుస్తోంది. పేకాట రాయుళ్లు పట్టుబడ్డ ప్రదేశం 3 టౌన్ పరిధిలోకి వస్తుంది అని పై అధికారులు ఆదేశించడంతో వారి సూచన మేరకు రూరల్ పోలీసులు ఈ కేసును 3 టౌన్ పోలీసులకు అప్పగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande