పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం
పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం
పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం


హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మహా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. జనసేన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం జరగనుంది.

మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.

ఈ హోమానికి అవనిగడ్డ నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande