కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు రేవంత్ సర్కార్?
హైదరాబాద్, 22 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వంరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రాజెక్టు అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు విషయంలో ఇవాళ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
Cm


హైదరాబాద్, 22 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వంరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రాజెక్టు అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు విషయంలో ఇవాళ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్తో పాటు పలువురు అధికారులపై ఎలాంటి చర్యలూ చేపట్టవద్దంటూ ఆదేశించింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగబోతోంది. ఈ సమావేశంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్ల తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణతో పాటు, ఆర్టీసీ సమ్మె తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande