చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యం.. మంత్రి అడ్లూరి
జగిత్యాల, 22 ఏప్రిల్ (హి.స.) చదువు ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడంపై దృష్టి సారిస్తున్నారని రాష్ట్ర మంత్రి మంత్రి అడ్లూరి
మంత్రి అడ్డూరి


జగిత్యాల, 22 ఏప్రిల్ (హి.స.)

చదువు ద్వారానే సమాజంలో మార్పు

సాధ్యమని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడంపై దృష్టి సారిస్తున్నారని రాష్ట్ర మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. దీంతో ప్రభుత్వ విద్యపై పేద విద్యార్థుల తల్లిదండ్రుల్లో విశ్వాసం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను మంత్రి అడ్లూరి, కలెక్టర్ సత్య ప్రసాద్ కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సమూల మార్పులతో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం, సాంకేతిక విద్య కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక డైట్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. కాస్మెటిక్ చార్జీలను కూడా పెంచినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలపై తల్లిదండ్రుల నమ్మకం పెరిగిందని, ఇందుకు ఆన్లైన్ ద్వారా వస్తున్న దరఖాస్తులే నిదర్శనమని పేర్కొన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనపట్ల దినేష్, ఆర్డీవో మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande