రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి 5.48 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణి
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి 5.48 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణి
Pds


హైదరాబాద్, 22 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఏప్రిల్ 30వ తేదీ గడువు కంటే ముందే, ఈ నెలకు ఇవ్వాల్సిన బియ్యంలో 85% పైగా పంపిణీ పూర్తి చేసింది. ఏప్రిల్ 21వ తేదీ నాటికే, రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి 5.48 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించింది.

కేంద్ర ప్రభుత్వం మార్చి 2న ఇచ్చిన ఆదేశాల మేరకే ఇంత వేగంగా రేషన్ ఇస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ 2026 నెలలకు సంబంధించిన రేషన్ పంపిణీని ముందుగానే పూర్తి చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు చెప్పింది. కొత్తగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో గోదాముల్లో స్థలం ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెలకు మొత్తం 6,43,303 మెట్రిక్ టన్నుల (MT) బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 5,48,140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. అంటే నెల ముగియడానికి ఇంకా ఎనిమిది రోజులు ఉండగానే 86 శాతం పంపిణీ పూర్తయింది. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు 2.62 కోట్ల ట్రాన్సక్షన్స్ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలకు రేషన్ అందింది.

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande