
మెదక్, 22 ఏప్రిల్ (హి.స.)
ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆర్టీసీ సమ్మె దృశ్య ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తాం అన్నారు. ప్రైవేట్ వాహనదారులు ఎక్కువ ఛార్జ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం కంట్రోల్ నెంబర్ 9391942254 ఏర్పాటు చేశాం అని,ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మె వల్ల జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. సమ్మెతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ బస్ డిపోల నుంచి బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మెదక్ నుంచి 100, నర్సాపూర్ నుంచి 34 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. రెండు బస్ డిపోల పరిధిలో కొత్తగా కండక్టర్ లను నియమిస్తున్నం అని, అని అదే విధంగా గతంలో ఆర్టీసీ డ్రైవర్ ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని పరిశీలించి తీసుకుని వారి సేవలు వినియోగించుకుంటున్నం అన్నారు. పోలీస్, రెవెన్యూ, రవాణా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్, కంపెనీ ల వారిని సహకరించాలని కోరడం జరిగిందని వారి సహకారంతో ప్రజల అవసరాల మేరకు వారికి బస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అవసరం ఉన్నవారు 9391942254 నంబర్ లో సంప్రదించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు