
కామారెడ్డి, 22 ఏప్రిల్ (హి.స.)
క్రమశిక్షణతో కష్టపడి చదువుకొని
ఉన్నత స్థాయికి ఎదగాలని అప్పుడే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం ఆయన దోమకొండ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ వసతి గృహాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలతో మాట్లాడారు. ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలుసుకొని, అందుకు అనుగుణంగా సలహాలు సూచనలు ఇచ్చారు. కష్టపడి చదువుకొని అటు తల్లిదండ్రులకు, ఇటు జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు సక్రమంగా లేదా అని అందుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం విషయంలో ఫోకస్ చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్ చైతన్య సుధను ఆదేశించారు. సీసీ రోడ్డు లేకపోవడం, వీధిదీపాలు లేకపోవడం వలన విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత జిల్లా సూపరింటెండెంట్, ఇంజనీర్, ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడి విద్యుత్ శాఖ సహకారంతో వైర్ గుంజి వీధిదీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పడిపోయిన ప్రహరీ గోడకు మరమ్మతులు చేయించాలని, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారితో మాట్లాడి, ప్రహరీ గోడను తిరిగి పునర్నిర్మించాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు