పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ డా. సత్య శారద
వరంగల్, 22 ఏప్రిల్ (హి.స.) పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా అందరితో ప్
Collector


వరంగల్, 22 ఏప్రిల్ (హి.స.)

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ సత్య శారద అన్నారు.

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. భూమి మనకు ఇచ్చిన సమర్థవంతంగా సహజ వనరులను వినియోగించుకోవడం మన అందరి లక్ష్యం అన్నారు. భవిష్యత్ తరాలకి మానవ మనుగడ సురక్షితంగా ఉండాలంటే.. పర్యావరణాన్ని సంరక్షించడం మన కర్తవ్యం” అని తెలిపారు. భూమిని పరిరక్షించడంలో పర్యావరణ సమతుల్యత ఎంతో కీలకమన్నారు. సరైన వనరుల వినియోగం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చన్నారు.

ప్రతి వ్యక్తి చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ వంటి చర్యల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు 50 మొక్కలు నాటాలని, పుట్టిన పాప నుండి మొదలుకొని సంవత్సరానికి ఒక్కటి చొప్పున మొక్కలు పెంచాలని వారు ఇప్పటి వరకు 25 మొక్కలను పెంచాలని, అవి ఇంకా సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటింటికి ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని తద్వారా భూగర్భ జలాలు రక్షించిన వాళ్ళమవుతామని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande