
రామాయపట్నం, 22 ఏప్రిల్ (హి.స.)
రామాయపట్నం పోర్టుకు 16 వందల 15 కోట్ల రూపాయలతో కార్గో రైల్ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఇది తూర్పుతీర ఆర్థిక పటాన్ని మార్చే గేమ్ ఛేంజర్గా నిలవనుంది. దీని ద్వారా రైలు-రోడ్డు మార్గాలు అనుసంధానమై. సరకు రవాణా సులభమవుతుంది. 2027 జనవరి నాటికి ప్రాజెక్టు మొదటిదశ పూర్తి చేయాలన్నది లక్ష్యం. వేల మందికి ఉపాధికి దారితీసే శక్తివంతమైన ఇంజిన్గా మారనుంది
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెట్టు సమీపంలోని చేవూరు, మోచర్ల గ్రామాల పరిధిలో రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా కార్గో రైల్ టెర్మినల్ ఏర్పాటు కానుంది. 16 వందల15 కోట్ల రూపాయలతో రామాయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 2027 జనవరి నాటికి ప్రాజెక్టు మొదటిదశ పనులు పూర్తిచేయాలన్నది లక్ష్యం. 2028 డిసెంబరు నాటికి మిగిలిన 3 దశలు పూర్తవుతాయి. దీని ద్వారా రైలు-రోడ్డు మార్గాలు అనుసంధానమై, సరకు రవాణా సులువవుతుంది. 13 వందల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. రామాయపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులు విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధితో తూర్పుతీరంలో సరకు రవాణాకు డిమాండ్ పెరుగుతుందని అంచనా.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi