సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం: హోం మంత్రి షణ్ముగంతో కీలక భేటీ
సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం
ap-ministerial-delegation-in-singapore-key-meeting-with-home-minister-shanmuga


సింగపూర్, 22 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధికి ప్రపంచ స్థాయి ప్రమాణాలను జోడించే లక్ష్యంతో ఏపీ మంత్రుల బృందం సింగపూర్ (Singapore) పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా రెండో రోజు ఇవాళ రాష్ట్ర మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ సింగపూర్ హోంమంత్రి కె.షణ్ముగం (K.Shanmugam)తో భేటీ అయ్యారు.

సింగపూర్లో అత్యంత పటిష్టంగా ఉండే శాంతిభద్రతల నిర్వహణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అక్కడ నేరాల నియంత్రణకు అమలు చేస్తున్న కఠిన చట్టాలు, పోలీసు వ్యవస్థ పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో సింగపూర్ అనుసరిస్తున్న టెక్నాలజీ ఆధారిత నిఘా వ్యవస్థను ఏపీలో ఎలా అమలు చేయాలనే అంశంపై హోం మంత్రి అనిత ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. అదేవిధంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS) ఆధ్వర్యంలో మంత్రుల బృందానికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రణాళికలు (Urban Planning) ఎలా ఉండాలి, భూమి వినియోగం (Land Governance), నగరాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలపై నిపుణులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘నేషన్ ఫస్ట్’ గవర్నెన్స్ అనే సిద్ధాంతంతో పాలనలో రాజకీయ జవాబుదారీతనం ఎలా పెంచాలనే అంశంపై మంత్రులు శిక్షణ పొందారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande