నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల పవన్ కల్యాణ్ సంతాపం
నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల పవన్ కల్యాణ్ సంతాపం
nadendla


అమరావతి :, 22 ఏప్రిల్ (హి.స.)

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ( Nadendla Bhaskara Rao ) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ఒక ప్రకటనలో సంతాపం ( Condolences) వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో విలువైనదని అన్నారు. భాస్కరరావు కుమారుడు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ పితృవియోగం బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రావు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్లో మృతి చెందారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande