రాష్ట్రంలో ఎండల తీవ్రత- తిరుపతి జిల్లాలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత
రాష్ట్రంలో ఎండల తీవ్రత- తిరుపతి జిల్లాలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత
వేడి


తిరుపతి, 22 ఏప్రిల్ (హి.స.)

రాష్ట్రంలో ఎండలు, వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవాళ తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 44.4 డిగ్రీల సెల్సియస్, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.1 డిగ్రీల సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేపు (గురువారం) 76 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 134 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఎల్లుండి ( శుక్రవారం) 51 తీవ్ర, 94 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో 19, విజయనగరం జిల్లాలో 21, పార్వతీపురం మన్యం 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4, పోలవరం 5, విశాఖలో 1, అనకాపల్లిలో 15, కాకినాడ జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande