నాదెండ్ల భాస్కరరావు మరణం రాష్ట్రానికి తీరని లోటు: జగన్
నాదెండ్ల భాస్కరరావు మరణం రాష్ట్రానికి తీరని లోటు: జగన్
nadendla


అమరావతి, 22 ఏప్రిల్ (హి.స.)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఈ రోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఏపీ రాజకీయాల్లో నాదెండ్ల భాస్కరరావు విశిష్ట స్థానం సంపాదించారని అన్నారు. ప్రజాసేవలో ఆయన నిబద్ధత, రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శమని చెప్పారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande