వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యం
హైదరాబాద్, 23 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్‌లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్‌లెస్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్‌స్క్రైబర్ పెరుగుదల
వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యం


హైదరాబాద్, 23 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్‌లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్‌లెస్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్‌స్క్రైబర్ పెరుగుదలను నమోదు చేసింది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అత్యాధునిక బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడంలో జియోకు సాటి లేకుండా ముందంజలో ఉంది. అంతే కాకుండా.. సంప్రదాయ మొబైల్ సేవల్లో కూడా వేగంగా ఎదుగుతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన హై-స్పీడ్ హోమ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణలో కనిపిస్తోంది. ఈ సర్కిల్‌లో వైర్‌లైన్ వృద్ధిని దాదాపు పూర్తిగా జియోనే సాధిస్తోంది. 2026 మార్చిలో జియో 31,000 కొత్త వైర్‌లైన్ కనెక్షన్లు సాధించి, మొత్తం ఫిక్స్‌డ్ లైన్ వినియోగదారుల సంఖ్యను 2.02 మిలియన్లకు పెంచింది. అదే సమయంలో భారతి ఎయిర్టెల్ కేవలం 7,648 కనెక్షన్లు మాత్రమే సాధించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande