మూడో రోజు సింగపూర్ పర్యటన.. PSA పోర్టును సందర్శించిన ఏపీ మంత్రుల బృందం
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్లో మూడో రోజు పర్యటిస్తోంది.
Singapore


అమరావతి, 23 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్లో మూడో రోజు పర్యటిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఎస్ఏను సందర్శించింది. పోర్టు నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను ఏ విధంగా వినియోగిస్తున్నారో మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సింగపూర్లోని PSA ఆధ్వర్యంలో నడుస్తున్న టువాస్ (TUAS) పోర్ట్.. 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమేటెడ్ టెర్మినల్గా రికార్డు సృష్టించబోతోంది. ఈ పోర్టులో అమలవుతున్న వినూత్న పద్ధతులను మంత్రుల బృందం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది.

పోర్టులో కంటైనర్లను ఒక చోటు నుంచి మరొక చోటికి తరలించడానికి ఉపయోగిస్తున్న డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల పనితీరును చూసి మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారీ క్రేన్లను ఆపరేటర్లు నేరుగా కాకుండా.. రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించే విధానాన్ని పరిశీలించారు. షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్మార్ట్ వ్యవస్థల ద్వారా కార్యకలాపాలను ఎలా వేగవంతం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande