
హైదరాబాద్, 23 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్రంలో యూరియా విక్రయాల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్' పై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్ ఏర్పాటు, విధివిధానాలపై కౌంటర్ దాఖలు చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. యూరియా కోసం యాప్ తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ నల్గొండ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ యాప్ రైతులకు ఇబ్బందికరంగా మారిందని దీనిని వ్యతిరేకిస్తూ రైతులు ధర్నా చేస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు.
అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది వదన వినిపిస్తూ యూరియా సరఫరాలో పారదర్శకత కోసంమే ఈ యాప్ తెచ్చామని కోర్టుకు విన్నవించారు. యూరియాపై ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోందని, అర్హులైన రైతులకు మాత్రమే యూరియా చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కోర్టకు వివరించారు. షాపుల వద్ద కంటే యాప్ ద్వారానే ఎక్కువ యూరియా సరఫరా చేస్తున్నామని కోర్టుకు వివరించగా... ప్రతి రైతుకు సాంకేతిక అవగాహన ఉండదు కదా అని ప్రభుత్వం తరపున న్యాయవాదనికి హైకోర్టు ప్రశ్నించింది. ఈ యాప్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు