
జగిత్యాల, 23 ఏప్రిల్ (హి.స.)
రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు. మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని,కల్వకోట గ్రామంలో మహిళా సంఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈదుల లింగంపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధరగా గ్రేడ్-ఏ రకానికి రూ.2389 చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు విప్ తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని అన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు