పొద్దుతిరుగుడు పంటను ప్రభుత్వమే కొంటుంది.. జుక్కల్ ఎమ్మెల్యే
కామారెడ్డి, 23 ఏప్రిల్ (హి.స.) రైతులు పండించిన పొద్దుతిరుగుడు ద్వారా పంటను ప్రభుత్వం విక్రయించాలని, దళారులకు అమ్మి నష్టపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచించారు. గురువారం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన పొద్దుతిర
MLA


కామారెడ్డి, 23 ఏప్రిల్ (హి.స.)

రైతులు పండించిన పొద్దుతిరుగుడు ద్వారా పంటను ప్రభుత్వం విక్రయించాలని, దళారులకు అమ్మి నష్టపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచించారు. గురువారం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లి కార్జున్ రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటకు సరైన ధర రావాలంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని అన్నారు. మధ్యవర్తుల మాటలకు మోసపోకుండా, పారదర్శకంగా జరుగుతున్న ప్రభుత్వ కొనుగోళ్లను ఆశ్రయిస్తే రైతులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి రైతు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. జుక్కల్ మండలంలోని మహ్మాదాబాద్, లాడెగావ్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలందరికీ సురక్షిత గృహాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం అందించే దిశగా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande