
తిరుమల, 23 ఏప్రిల్ (హి.స.): శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతపై తితిదే ప్రత్యేక దృష్టి పెట్టింది. భక్తులకు అవసరమైనప్పుడు నిమిషాల్లో వైద్యం అందేలా తిరుమలలో 16 వైద్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అశ్విని ఆసుపత్రి ప్రధాన వైద్యశాల కాగా.. దీనికి అనుబంధంగా అపోలో హార్ట్ సెంటర్ పనిచేస్తోంది. వీటితో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్-6 ఎదురుగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కన, కల్యాణకట్ట, ఏటీసీ సర్కిల్, పీఏసీ-5, శ్రీవారి ఆలయం, అలిపిరి నడక మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, రద్దీ సమయంలో నారాయణగిరి షెడ్ల వద్ద ఉన్న వైద్య కేంద్రాల్లో అన్ని వేళలా భక్తులకు వైద్య సేవలు అందనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు