
న్యూఢిల్లీ, 23 ఏప్రిల్ (హి.స.)
ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఇవాళ ఢిల్లీలోని 10 జన్పథ్లో జరిగిన ఈ మీటింగ్లో రాష్ట్రంలోని తాజా పరిణామాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రాహుల్ గాంధీకి మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. దాదాపు 15 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరంగా జరుగుతున్న ఆర్గనైజేషన్ కార్యక్రమాలను రాహుల్ కు వివరించారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బిఎల్లోల నియామకాలు, అనుబంధ సంఘాల నియామకాలు తదితర అంశాలపై సమావేశంలో రాహుల్ గాంధీకి వివరించారు.
ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిపి అధికారిక సమాచారాన్ని ప్రకటించినట్టుగా రాహుల్ గాంధీకి మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. మహిళ రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా జోడించాలని ఈ సందర్భంగ రాహుల్కు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని కోరగా ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించారు. అంతకు ముందు మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు, రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ కూడా రాహుల్ గాంధీ గాంధీ గారితో సమావేశం అయ్యారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..