వారం రోజులుగా కలుషిత నీటి సరఫరా
హైదరాబాద్ గోషామహల్ సెక్షన్ పరిధిలో వారం రోజులుగా కలుషిత నీటి సరఫ రా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Polluted water


హైదరాబాద్, 23 ఏప్రిల్ (హి.స.)గోషామహల్ సెక్షన్ పరిధిలో వారం రోజులుగా కలుషిత నీటి సరఫ రా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుడీబజార్, జైన మందిరం, లంబీగల్లీ, బేదర్వాడి తదితర ప్రాంతా ల్లో తాగునీరు కలుషితంగా వస్తోందని, ఈ విషయాన్ని జలమండలి డీజీఎం, జీఎం, ఏజీఎంలకు విన్నవించినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చందన్వాడీ, జుమ్మెరాత్ బజార్ ప్రాంతాల్లో ఇదే సమస్యలు ఉండేవని, ప్రజలు తిరగబడడంతో గతంలో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ కల్పించుకొని సమస్యలను పరిష్కరించారని గుర్తుచేశారు. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా సమాధామిస్తున్నారని పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకుంటే బస్తీవాసులంతా జలమండలి ఎండీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande