
హైదరాబాద్, 23 ఏప్రిల్ (హి.స.)
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే (Mallkarjuna Kharge)పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన నోటీసులపై రామచందర్ రావు స్పందిస్తూ.. ఖర్గే ఇక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వడం మంచిదని సలహా ఇచ్చారు.
ఖర్గే తన సొంత ఆలోచనతో మాట్లాడటం లేదని, కేవలం రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే వ్యవహరిస్తున్నారని రామచందర్ రావు ఆరోపించారు. ఖర్గే చేసే ప్రతి ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ఈసీ కేవలం నోటీసులతో సరిపెట్టడం భావ్యం కాదని.. దేశ ప్రజలే కాంగ్రెస్కు, ఖర్గేకు తగిన బుద్ధి చెప్పాలని రామచందర్ రావు పేర్కొన్నారు.
నేడు పశ్చిమ బెంగాల్ (West Bengal) తొలి దశ ఎన్నికలు, అలాగే తమిళనాడు (Tamilnadu) అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయని ని రామచందర్ రావు అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఓటర్లు భయం వీడి భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు తీసుకుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. మే 4న వెలువడే ఫలితాలు రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ మార్పును తీసుకువస్తాయని, బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు