
సూర్యాపేట,, 23 ఏప్రిల్ (హి.స.)
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వేసిన ఘోష్ కమిషన్ చెల్లదని ఇది రాజ్యాంగ విరుద్దంగా ఉన్న కమిషన్ అని కేసీఆర్, హరీష్ రావులపై చేసిన ఆరోపణలు చెల్లవని హైకోర్టు తీర్చు ఇవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఏ ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడడని నేడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సెక్షన్ 80, 8బి ప్రకారం చట్ట విరుద్ధంగా కేసీఆర్, హరీష్ రావులపై నిందారోపణలు చేయడం తగదని హైకోర్టు తీర్పు చెప్పడం జరిగిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి, నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలు తప్పుడు మాటలని ఈ తీర్చుతో తేలిపోయిందన్నారు. పీసీసీ రూపొందించిన ఈ ఘోష్ కమిషన్ కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా మారి లేని పోని ఆరోపణలు చేశారన్నారు.
కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదని 210 కి.మీ సొరంగం, బ్యారేజులు, లిప్టులు, కెనాల్స్ కాళేశ్వరంలో భాగమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు అయింది రూ.94 వేల కోట్లని వారే చెప్పి ఇప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం సరికాదన్నారు. అసలు మేడిగడ్డ నిర్మాణానికి అయింది రూ.3,800 కోట్లని అక్కడ ఒక పిల్లర్ కూలితే దాన్ని ఏడీఈ కి అప్పగించినా పది రోజుల్లో రిపేరు చేసేవారని దాన్ని కూల్చి చూపించి కాళేశ్వరం కూలింది ఇది కూళేశ్వరం అని చెప్పి కాళేశ్వరాన్ని నీట ముంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందన్నారు. నేడు మెదక్, మహబూబ్నగర్ జిల్లాలకు కాళేశ్వరం ద్వారా నీరు అందిందని ఒక్క సూర్యాపేట జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో రైతులు 9 సీజన్లలో పంటను పండించారన్నారు. ఈ రెండేళ్ల నుండి కాళేశ్వరం నీళ్లొస్తే కేసీఆర్ గుర్తొస్తడని కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఇప్పటికైనా ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని అయినా పట్టించుకునే పాపానపోవడం లేదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi