
మహబూబాబాద్ , 23 ఏప్రిల్ (హి.స.)
మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులపై పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. రెండో రోజు సమ్మె కొనసాగుతుండగా తొర్రూరు డిపో వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. విధులకు రాని 21 మంది కార్మికులపై కేసు నమోదు చేశారు. సమ్మెలో పాల్గొనేందుకు డిపో వద్దకు వస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi