రోగులకు అందించే సేవల్లో ప్రయోగాత్మకంగా కృత్రిమ మేధ
రోగులకు అందించే సేవల్లో ప్రయోగాత్మకంగా కృత్రిమ మేధ
రోగులకు అందించే సేవల్లో ప్రయోగాత్మకంగా కృత్రిమ మేధ


అమరావతి, 24 ఏప్రిల్ (హి.స., ) రాష్ట్రంలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అందించే సేవల్లో ప్రయోగాత్మకంగా కృత్రిమ మేధ (ఏఐ)ను ప్రవేశపెట్టి పరీక్షించారు. స్టార్టప్ కంపెనీల ద్వారా అందించిన ఆ ఏఐ సేవల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టార్ట్పలకు 4 కేటగిరిల్లో మొత్తం రూ. 40 లక్షలు ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఓ స్టార్ట్పకు రూ. కోటి విలువ చేసే వర్క్ ఆర్డర్ కూడా ఇస్తారు. ఈ పరీక్ష కోసం ఆరోగ్యశాఖ ఏపీ మెడ్ టెక్ ఇన్నోవేషన్ చాలెంజ్ ప్రకటనకు 297 స్టార్ట్పల నుంచి దరఖాస్తులు రాగా మూడు అంచెల పరిశీలన అనంతరం 18 సంస్థలను ఎంపిక చేశారు. కేటగిరీల వారీగా ఈ స్టార్ట్పలు ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు అందించాయి.

దేశంలోనే తొలిసారిగా ఏపీలో స్టార్ట్పల ద్వారా వైద్య సేవలను రోగులకు అందుబాటులోకి తెచ్చినట్లు వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande