రాబోయే 10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
రాబోయే 10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
రాబోయే 10 రోజుల్లో  ఏపీ అసెంబ్లీ సమావేశాలు


అమరావతి, 24 ఏప్రిల్ (హి.స.)

చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు ముఖ్యంగా మహిళలకు వివరించాలని ఎన్డీయే కూటమిలోని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలో ఎన్డీయే నేతలు, ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర భాగస్వామ్య పక్షాల వైఖరిని ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబును పీవీఎన్ మాధవ్ కోరారు. అందుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

రాబోయే 10 రోజుల్లో ఏపీ అసెంబ్లీసమావేశాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ సమావేశాల వేదికగా ‘ఈ అంశం’ పై చర్చిద్దామన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మినహా అన్ని పక్షాలు సమర్థించాయని ఆయన గుర్తు చేశారు. మహిళ రిజర్వేషన్ బిల్లును మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని వివరించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక కమిటీని నియమించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీలో ఉంటారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande