
అమరావతి, 24 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ నూతన దిశగా ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం స్పందించారు. గ్రామ స్వరాజ్యం దిశగా ఏపీ వేగంగా అడుగులు వేస్తోందని.. స్వయం ప్రతిపత్తితో ముందుకు సాగుతోందన్నారు. గ్రామ సభలకు పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఎమ్జీఎన్ఆర్ఈజీఎస్ సమన్వయంతో గ్రామ సభలు, పల్లె పండుగ 1.0 & 2.0 విజయవంతం అయ్యాయని అన్నారు.
స్వచ్ఛ రథాలు, ఎస్ఎల్ఆర్ఎమ్(SLRM) కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్స్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. ఈ గ్రామ స్వరాజ్యం యాత్రలో భాగస్వాములైన ప్రజలకు, సర్పంచ్లకు, వార్డ్ సభ్యులకు, పంచాయతీరాజ్ అధికార యంత్రాంగానికి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్