యాదగిరి గుట్ట నరసన్న స్వామి సన్నిధిలో సీపీ సజ్జనార్
యాదగిరి గుట్ట నర్సింహస్వామి సన్నిధిలో సీపీ సజ్జనార్
Sajna r


యాదగిరిగుట్ట, 24 ఏప్రిల్ (హి.స.) హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్థంభానికి మొక్కులు చెల్లించుకున్న సీపీ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande