
సింహాచలం, 24 ఏప్రిల్ (హి.స.)
శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 25 శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఈఓ జె. వెంకట్రావు తెలిపారు. చక్రవర్తి తిరుమగన్ తిరునక్షత్రం (వైష్ణవ శ్రీరామ నవమి) సందర్భంగా ఆలయంలో విశేష కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీరామ జననం ఘట్టం పురాణ విన్నపం, సేవాకాలం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సాయంత్రం 5.30 గంటలకు హనుమత్ వాహనంపై గ్రామ తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆ రోజు సుప్రభాతం, ఆరాధనం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV