భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డి
భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డి
Dgp


వేములవాడ, 24 ఏప్రిల్ (హి.స.)

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా రుద్రంగి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో భీమన్నను దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా డీజీపీ పర్యటనలో కాస్త గందరగోళం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకై హైదరాబాద్ నుండి బయలుదేరిన డీజీపీ శివధర్ రెడ్డి వేములవాడకు చేరుకున్న వెంటనే ముందుగా భీమన్న దర్శనం నిమిత్తం ఆలయ ప్రాంగణంలోనికి వచ్చారు.

అయితే స్వామివారిని మరికొద్దిసేపట్లో దర్శించుకోవాల్సిన ఆయన కేవలం పోలీస్ గౌరవ వందనం మాత్రమే స్వీకరించి హుటాహుటిన రుద్రంగికి బయలుదేరి వెళ్ళారు. కార్యక్రమం అనంతరం మళ్ళీ తిరుగు ప్రయాణంలో భీమన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న డీజీపీ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ ఆకస్మిక పరిణామాలతో స్థానిక పోలీసులతో పాటు జర్నలిస్టులు కాస్త అయోమయానికి గురయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande