
జగిత్యాల, 24 ఏప్రిల్ (హి.స.)
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల
కేంద్రంలో ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ... గ్రామాల్లో మరింతమంది కూలీలను ఉపాధి హామీ పనుల్లో భాగస్వామ్యం చేయాలని ఆయన అధికారులను సూచించారు.
అలాగే ప్రతి గ్రామంలో కూలీల సంఖ్యను బట్టి పనులను అందుబాటును ఉంచాలని ఆదేశించారు. అలాగే పనుల ఎంపికలో పారదర్శకతను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆయన తెలిపారు. . కూలీలకు సమయానికి వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. అదే విదంగా ఉపాధి హామీ పనులలో మహిళలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.
ప్రతి పనిని ఫోటో క్యాప్చరింగ్ ద్వారా ఎన్ ఎం ఎం ఎస్ యాప్ లో నమోదుతో పాటు జియో ట్యాగింగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో ఎక్కడ కూడా ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..