అన్నదాతలు అధైర్య పడొద్దు: మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట, 24 ఏప్రిల్ (హి.స.) అకాల వర్షాలు, వడగండ్ల వానలతో జరిగిన పంట నష్టంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఆందోళన చెందొద్దు, అధైర్య పడొద్దని రైతులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. పంట నష్టంపై జిల్లా కలెక్టర్,
హరీష్ రావు


సిద్దిపేట, 24 ఏప్రిల్ (హి.స.)

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో జరిగిన పంట నష్టంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఆందోళన చెందొద్దు, అధైర్య పడొద్దని రైతులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. పంట నష్టంపై జిల్లా కలెక్టర్, జిల్లా, నియోజకవర్గ వ్యవసాయ అధికారులతో హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... సిద్దిపేట అర్బన్ మండలంలో ఎక్కువ నష్టం జరిగిందని తన దృష్టికి వచ్చిందని, సిద్దిపేట నియోజకవర్గం ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో ఆయా గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో నష్టపోయిన పంటను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశించారు. అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంట నేల పాలై ఆందోళనలో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి ఐదుసార్లు వడగండ్ల వానలకు, ఒకసారి తుఫాన్తో రైతులకు పంట నష్టం జరిగిందని గుర్తు చేశారు. మామడి పండ్ల తోటలు, వరి, మొక్క జొన్న పంటలకు నష్టం జరిగి, రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గతంలో ముగ్గురు మంత్రులు కలిసి సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ గ్రామంలో నష్టపోయిన పంటను పరిశీలించారు. కానీ ప్రభుత్వం నేటికీ ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పంటనష్ట పరిహారం రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande