
తిరుమల, 24 ఏప్రిల్ (హి.స.)
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో, క్యూలైన్ వెలుపల శిలాతోరణం వరకు చేరుకుంది. దీంతో టోకెన్లు లేని సాధారణ భక్తుల సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. నిన్న (ఏప్రిల్ 23న) శ్రీవారిని 59,602 మంది భక్తులు దర్శించుకోగా, అందులో 29,280 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.46 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV