ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్లపై గొర్రెల కాపరుల దాడి
ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్లపై గొర్రెల కాపరుల దాడి
ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్లపై గొర్రెల కాపరుల దాడి


రాఘవాపురం, 24 ఏప్రిల్ (హి.స.)ప్రకృతి ప్రేమికుడు, జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్శర్ల సత్యనారాయణపై గొర్రెల కాపరులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ దాడిలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

రాఘవాపురంలో తనకున్న 70 ఎకరాల భూమిలో దుశ్శర్ల సత్యనారాయణ ఎన్నో ఏళ్లుగా మొక్కలను పెంచి దాన్ని ఒక దట్టమైన అడవిగా మార్చారు. గురువారం ఆయన లేని సమయంలో కొందరు గొర్రెల కాపరులు తమ గొర్రెలను ఆ అడవిలో మేపుతూ చెట్ల కొమ్మలను నరుకుతున్నారు. గురువారం రాఘవాపురానికి చెందిన గొర్రెల కాపర్లు బయ్య గంగయ్య, మల్లయ్య ఆ అడవిలో చెట్లు నరుకుతూ, గొర్రెలను మేపుతూ కనిపించారు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన సత్యనారాయణ తన అడవిలో గొర్రెలను ఎందుకు మేపుతున్నారని వారిని ప్రశ్నించారు.

ఈ క్రమంలో మాటామాటా పెరిగి, గొర్రెల కాపరులు కర్రలు, రాళ్లు, గొడ్డళ్లతో ఆయనపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను స్థానికులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande