శ్రీవారికి రూ.94.80 లక్షల విలువైన బంగారు పతకాలు విరాళం
శ్రీవారికి రూ.94.80 లక్షల విలువైన బంగారు పతకాలు విరాళం
శ్రీవారికి రూ.94.80 లక్షల విలువైన బంగారు పతకాలు విరాళం


తిరుమల :, 24 ఏప్రిల్ (హి.స.)

తిరుమల ( Tirumala ) శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను ( Gold Medals) విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి బంగారు పతకాలను అందజేశారు.

హైదరాబాద్ ( Hyderabad ) కు చెందిన డాక్టర్ గీతిక సాయి శుక్రవారం టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టు ( Annaprasadam Trust ) కు రూ.10,01,116 విరాళంగా అందించారు. అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన ఏసీఎస్ టెక్నాలజీస్ సంస్థ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవోకు విరాళం డీడీలను అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande