
హైదరాబాద్, 24 ఏప్రిల్ (హి.స.)
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామమైన ముత్తోజిపేటలో ఉద్రిక్తత నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోనకు తీసుకెళ్లి నివాళులర్పించేందుకు సిద్ధమైన ఆర్టీసీ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. నర్సంపేట డిపోనకు తీసుకెళ్లేందుకు అనుమతించాలని శంకర్ గౌడ్ కుటుంబసభ్యులు, ఆర్టీసీ కార్మికులు వేడుకున్నారు. అయినప్పటికీ పోలసీులు వినిపించుకోలేదు.
ఈ క్రమంలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోనకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యత్నించారు. దీంతో పోలీసులను వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సహా బీఆర్ఎస్ నాయకులు, కార్మికులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట డిపోకు తీసుకెళ్లకుంటే శంకర్ గౌడ్ ఆత్మ శాంతించదని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi