ఓటింగ్ శాతం పెరగడం మార్పునకు సంకేతం: బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు
ఓటింగ్ శాతం పెరగడం మార్పునకు సంకేతం: బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు
Bjp


హైదరాబాద్, 24 ఏప్రిల్ (హి.స.)

పశ్చిమ బెంగాల్ (West Bengal)తో పాటు తమిళనాడు (Tamilnadu)లో భారీగా ఓటింగ్ శాతం నమోదవడం పట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్ శాతం పెరగడం అనేది ప్రజల్లో వస్తున్న మార్పునకు సంకేతమని అన్నారు. బెంగాల్, తమిళనాడులలో భారీగా ఓట్లు పోలవ్వడం చూస్తుంటే ప్రజలు కోరుకుంటున్నారని మార్పును స్పష్టమవుతోందని తెలిపారు. ఈ ఓటింగ్ బహుశా ప్రభుత్వాల మార్పు కోసమే జరిగి ఉండవచ్చని రామచందర్ రావు అన్నారు.

ఇక రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితా ప్రక్షాళన (SIR) సమర్థవంతంగా జరిగిందని ఆయన గుర్తు చేశారు. నకిలీ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, అక్రమంగా బదిలీ అయిన ఓట్లను తొలగించడం వల్లే ఇప్పుడు అసలైన ఓటర్ల జాబితా సిద్ధమైందని తెలిపారు. గతంలో అక్రమ ఓట్ల వల్ల గందరగోళం ఉండేదని, ఇప్పుడు వాటన్నింటినీ తొలగించిన తర్వాత కూడా ఓటింగ్ శాతం పెరగడం ప్రజాస్వామ్యంలో ఒక శుభ పరిణామమని ఆయన కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande