రాష్ట్రంలో.మలేరియా నివారణకు .చర్యలు.తీసుకుంటాం
రాష్ట్రంలో.మలేరియా నివారణకు .చర్యలు.తీసుకుంటాం
రాష్ట్రంలో.మలేరియా నివారణకు .చర్యలు.తీసుకుంటాం


అమరావతి, 25 ఏప్రిల్ (హి.స.)రాష్ట్రంలో మలేరియా నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇందులో భాగంగా బాపట్ల, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలను మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు కేంద్రానికి ప్రతిపాదన లు పంపుతున్నామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 899 కేసులు నమోదైనట్లు చెప్పారు. 2030 నాటికి మలేరియా కేసులను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినం సందర్భంగా, రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఇండోర్ రెసిడ్యువల్ స్ర్పే చేస్తున్నామన్నారు. బాపట్ల, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలను మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు ప్రతిపాదనలను కేం ద్రానికి పంపనున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande