
అమరావతి, 25 ఏప్రిల్ (హి.స.)రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది మహిళలు గత 12 ఏళ్లుగా ఈ పథకంలో సభ్యులుగా ఉండి, సుమారు రూ.1,194 కోట్లు పొదుపు చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ వాటా రూ.1,000 కోట్లు కలిపితే ఈ నిధి మొత్తం రూ.2,194 కోట్లకు చేరుకుంది. అయితే.. గత ప్రభుత్వం ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతో మహిళలు ఆందోళనకు గురయ్యారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ మేరకు.. డ్వాక్రా మహిళల సొమ్మును వడ్డీతో సహా తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మళ్లించిన నిధులను తిరిగి సమీకరించి, మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నిర్ణయంతో 22 లక్షల మంది మహిళలకు ఆర్థికంగా వెసలుబాటు కలుగుతుంది.
ప్రస్తుతం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇతర పథకాలతో పోలిస్తే అభయహస్తం పెన్షన్ తక్కువగా ఉండటంతో, చాలామంది మహిళలు తమ అసలు సొమ్మును వెనక్కి తీసుకోవడానికే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిధులను సెటిల్ చేయడం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేసినట్లయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ