శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్కు బాంబు బెదిరింపు
శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్కు బాంబు బెదిరింపు
Bomb


హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.)

హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ

అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) శనివారం బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనంలో బాంబు అమర్చినట్లు అధికారులకు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయ అధికారిక మెయిల్ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఒక సందేశం అందింది. అందులో టెర్మినల్ ప్రాంగణంలో బాంబు ఉందని, అది ఏ క్షణమైనా పేలవచ్చని హెచ్చరించారు. దీంతో వెంటనే ఎయిర్పోర్ట్ అథారిటీ పోలీసులకు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) కు సమాచారం అందించింది.

సమాచారం అందిన వెంటనే అధికారులు 'బాంబు థ్రెట్ అసెస్మెంట్ కమిటీ' (BTAC) సమావేశాన్ని నిర్వహించి, ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ ప్రకటించారు. డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీమ్స్ తో కలిసి టెర్మినల్ అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వెయిటింగ్ హాల్స్, పార్కింగ్ ఏరియాలు, చెక్-ఇన్ కౌంటర్లు మరియు లగేజీ స్కానింగ్ విభాగాల్లో ముమ్మరంగా గాలించారు. ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురైనప్పటికీ, భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Shamshabad Airport) పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపు మెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేస్తోంది. తప్పుడు సమాచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande