
హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.)
దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్
రాకెట్ విక్రమ్-1 తదుపరి ప్రయోగానికి సిద్ధమైంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC)కు తరలించేందుకు హైదరాబాద్ మాక్స్ క్యూ క్యాంపస్ నుంచి సీఎం రేవంత్ జెండా ఊపి ప్రారంభించారు. ఇవాళ శంషాబాద్ లోని జీఎంఆర్ ఏరో స్పేస్ పార్క్ లో ఇవాళ విక్రం 1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఫ్రాన్స్ కు చెందిన సాఫ్రన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ సేవలను ఇప్పటికే ఇక్కడ ప్రారంభించగా ఇందులో విక్రం-1 రాకెట్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఎరో స్పేస్ పార్క్ కు సంధించి అక్కడి అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. విక్రమ్ 1 రాకెట్ ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నీ పూర్తి చేసుకుని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ కు చేరుకోనుంది. ప్రైవేట్ రంగంలో భారత అంతరిక్ష రంగానికి ఇది కీలక మైలురాయిగా నిపుణులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు