
కరీంనగర్, 25 ఏప్రిల్ (హి.స.)
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్
పరిధిలోని కో-ఆప్షన్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) చక్రం తిప్పారు. మొత్తం 5 స్థానాలకు గాను 5 స్థానాలను బీజేపీ (BJP) కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిలువునా చీలడం చర్చనీయాంశమైంది.
కో-ఆప్షన్ ఎన్నికల సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నలుగురు బీఆర్ఎస్ (BRS) కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించి జై కొట్టారు. దీంతో మొత్తం 38 మంది కార్పొరేటర్ల బలం బీజేపీ అభ్యర్థులకు లభించింది. ఓటింగ్ బలం లేదని గ్రహించిన బీఆర్ఎస్ డీలా పడగా, గెలవలేమని ముందే ఊహించిన కాంగ్రెస్ ఈ ప్రక్రియకు దూరంగా ఉండిపోయింది. కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారిలో బొమ్మకల్ ప్రాంతానికి చెందిన నందన్ కుమార్, మైనారిటీ కార్యకర్త ముజీబ్, బల్బీర్ సింగ్, మాజీ కార్పొరేట్ చిగురు రవి తల్లి చిగురు వెంకటమ్మ, ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన కన్నె కృష్ణ ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..