
అమరావతి, 25 ఏప్రిల్ (హి.స.)
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు అతి త్వరలో ఈగల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. శనివారం మంగళగిరిలో ఈగల్ హెడ్ క్వార్టర్స్ను ఆయన ప్రారంభించారు. అనంతరం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ఏడాదిన్నర క్రితం ఈగల్ వింగ్ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశామన్నారు. పని తీరుతో ఈగల్కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈగల్ను ప్రీమియర్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుతున్నామన్నారు.
గంజాయి పెంపకం, ఉత్పత్తిను నిరోధించేందుకు.. అలాగే ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్) అమలు చేయడంలో ఈగల్ ముందుందని వివరించారు. గతంలో ఆక్టోపస్, గ్రేహోండ్స్ తరహాలోనే ఈగల్ కూడా బాగా రాణిస్తుందని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు జీరో చేయగలిగారని చెప్పారు. భవిష్యత్తులో ఈగల్ టీం మరింత యాక్టివ్గా పని చేస్తుందని పేర్కొన్నారు. డ్రోన్లు, శాటిలైట్లతో గంజాయి నిర్మూలన చేస్తున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ