
విజయవాడ, 25 ఏప్రిల్ (హి.స.) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోక్ భవన్కు వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్తో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. స్వల్ప అస్వస్థత కారణంగా గవర్నర్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. దీంతో లోక్ భవన్కు చేరుకున్న సీఎం.. గవర్నర్ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు(శనివారం) ఉదయం కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు గవర్నర్. వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని సూచించారు. ఇవాళ ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పిన గవర్నర్.. మరోసారి ఆసుపత్రికి వస్తానని చెప్పి వెళ్లిపోయారు.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్