కవితకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే: ఎంపీ అర్వింద్
ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి, బీజేపీని గెలిపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
Aravind


హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.)సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే.. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి, బీజేపీని గెలిపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శనివారం కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు.

సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే.. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వారిని, బీజేపీని గెలిపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శనివారం కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పిట్టల దొరను చూశారని.. ఇప్పుడు పిట్టల దొరసానిని చూస్తారని వ్యంగ్యంగా విమర్శించారు. కవితకు బీజేపీ రాజకీయ సమాధి కట్టిందని గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande