కవిత తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కిరణ్ కుమార్ రెడ్డి
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
kiran


హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.)కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మగా జేబులు చూసి కాదని.. కడుపు చూసి పాలిస్తానని ఆమె చెప్పారని ప్రస్తావించారు.

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మగా జేబులు చూసి కాదని.. కడుపు చూసి పాలిస్తానని కవిత చెప్పారని ప్రస్తావించారు. ఈరోజు(శనివారం) హైదరాబాద్ వేదికగా కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జేబులు చూసి పరిపాలించారని కవిత చెప్పారని అన్నారు.నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గతంలో టీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో మంచి ఆదరణ వచ్చేదని చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande