
నాగర్ కర్నూల్, 25 ఏప్రిల్ (హి.స.)
తన సొంత వ్యవసాయ క్షేత్రంలో
మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ట్రాక్టర్తో దుక్కి దున్ని పలువురిని ఆశ్చర్యపరిచారు. వ్యవసాయం సాగు కోసం మంత్రి జూపల్లి సొంతంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్కు కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. అనంతరం పట్టణ శివారులో మంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న తన సొంత పొలంలో ట్రాక్టర్తో కొద్దిసేపు దుక్కి దున్నారు. నిత్యం ప్రజలు, అధికారులతో బిజీగా ఉండే మంత్రి జూపల్లి తీరిక తీసుకుని వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. తన సొంత పొలంలో ట్రాక్టర్తో దుక్కిదున్నిన తీరును చూస్తే వ్యవసాయ రంగానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. నేల తల్లిని నమ్ముకుని ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి జూపల్లి స్వయంగా దుక్కి దున్నడం విశేషంగా నిలిచింది. అయితే ముందుగా మంత్రి జూపల్లి తన పొలంలో తిరిగి పరిస్థితులను పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..