ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాదర్భార్ లక్ష్యం : మంత్రి పొంగులేటి
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాదర్భార్ లక్ష్యం : మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి


ఖమ్మం, 25 ఏప్రిల్ (హి.స.)

ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు

తిరిగే రోజుల నుంచి ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి, మీ మీ సమస్యలను పరిష్కరించే వేదికే ప్రజాదర్బార్ అని తెలిపారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

28 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయాలనే తపనతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రూపొందించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా స్థాయి అధికారులను గ్రామాలకే రప్పించి సత్వరమే ప్రజల అర్జీలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలన చేపిస్తానని, టైం బౌండ్ ప్రకారం వాటిని పరిష్కరిస్తానన్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలని, ఇప్పుడు రాజకీయాలకు అతీతంగానే పనిచేస్తున్నామన్నారు. ప్రజల కష్టాలు, బాధలు వినగలిగితే ఎలాంటి ఫలితాలు మనకు ఇస్తారో ప్రతి ఎన్నికల్లో చూశామని, ఇప్పుడిప్పుడే ఆర్థికాభివృద్ధి మెరుగవుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతాయన్నారు. ఈ నెల 27 నుండి ప్రతి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో చర్చించి, రెవెన్యూ, హౌసింగ్ సమస్యలు పరిష్కరించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయే తీరుగా వ్యవహరించకుండా, వారికి తోడుగా ప్రజాప్రతినిధులు నిలవాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande