
అమరావతి, 25 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్రంలో ఇంధన కొరతతో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూసివేత అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( ఈరోజు(శనివారం) సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, వాహనదారులు, రైతుల ఇబ్బందులపై అధికారులతో సీఎం మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ